TS: గ్రూప్-1 ప్రిలిమ్స్ వాయిదాకు హైకోర్టు ధర్మాసనం నిరాకరణ

గ్రూప్- 1 ప్రిలిమ్స్ పరీక్ష వాయిదాకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఎల్లుండి జరగనున్న ప్రిలిమ్స్ పరీక్షలో జోక్యానికి ధర్మాసనం నిరాకరిస్తూ.. అప్పీల్‌ను కొట్టివేసింది.

Updated : 09 Jun 2023 13:11 IST

హైదరాబాద్‌: గ్రూప్- 1 ప్రిలిమ్స్ పరీక్ష వాయిదాకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఎల్లుండి జరగనున్న ప్రిలిమ్స్ పరీక్షలో జోక్యానికి ధర్మాసనం నిరాకరిస్తూ.. అప్పీల్‌ను కొట్టివేసింది. గ్రూప్- 1 ప్రిలిమ్స్ వాయిదా వేయాలన్న పిటిషన్లను ఇటీవల సింగిల్‌ జడ్జి కొట్టేయగా.. ఆ ఉత్తర్వులను ధర్మాసనం వద్ద ఓ విద్యార్థి సవాల్‌ చేశారు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ నామవరపు రాజేశ్వర రావుతో కూడిన హైకోర్టు ధర్మాసనం.. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను నిలిపివేయడం పరిష్కారం కాదని అభిప్రాయపడింది.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని