MLAs Bribery Case: ఎమ్మెల్యేలకు ఎరకేసు..సిట్‌ మెమోను కొట్టివేసిన హైకోర్టు

ఎమ్మెల్యేలకు ఎరకేసులో గతంలో సిట్ దాఖలు చేసిన మెమోను హైకోర్టు కొట్టివేసింది. దీనిపై గతంలో అనిశా కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.

Updated : 02 Jan 2023 15:38 IST

హైదరాబాద్‌: ఎమ్మెల్యేలకు ఎరకేసు (MLAs Bribery case)లో సిట్‌ దాఖలు చేసిన మెమోను అనిశా కోర్టు కొట్టివేయడాన్ని హైకోర్టు (HighCourt) సమర్థించింది. భాజపా నేత బీఎల్‌ సంతోష్‌, తుషార్‌ వెల్లాపల్లి, శ్రీనివాస్‌లను ఈ కేసులో నిందితులుగా చేరుస్తూ.. గతంలో సిట్‌ మెమో దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ ముగ్గుర్నీ నిందితులుగా చేర్చడాన్ని తోసిపుచ్చిన అనిశా కోర్టు ఇటీవల సిట్‌ మెమోను కొట్టివేసింది. దీంతో సిట్‌ బృందం హైకోర్టును ఆశ్రయించింది. తాజాగా విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం సిట్‌ అప్పీలును కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని