Published : 01/04/2021 16:19 IST

TS: పరువు హత్యలపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పరువు హత్యలపై సామాజిక కార్యకర్త సాంబశివరావు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్రంలో జరిగిన పరువు హత్యలపై తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి హైకోర్టుకు నివేదిక సమర్పించారు. ఈ రకం హత్యల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని.. వాటిని తీవ్రంగా పరిగణించి దర్యాప్తు చేస్తున్నట్లు నివేదికలో వెల్లడించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటిస్తున్నట్లు చెప్పారు. అయితే సుప్రీం మార్గదర్శకాలను ఎలా అమలు చేస్తున్నారో చెప్పాలని ధర్మాసనం డీజీపీని ప్రశ్నించింది. ఇప్పటివరకు జరిగిన పరువు హత్యల దర్యాప్తు స్థితిపై పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 5వ తేదీకి వాయిదా వేసింది.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని