MLAs Bribery case: ఎమ్మెల్యేలకు ఎర కేసు.. హైకోర్టులో సిట్‌ లంచ్‌ మోషన్‌ పిటిషన్‌

ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) వేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌పై విచారించేందుకు హైకోర్టు అంగీకరించింది.

Published : 19 Nov 2022 13:30 IST

హైదరాబాద్‌: ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) వేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌పై విచారించేందుకు హైకోర్టు అంగీకరించింది. దిల్లీ పోలీసులు విచారణకు సహకరించడం లేదని పిటిషన్‌లో సిట్‌ పేర్కొంది. దిల్లీలో ఓ వ్యక్తికి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు అనుమతించడం లేదని తెలిపింది. ఈ కేసు విచారణకు అంతరాయం కలిగించొద్దని దిల్లీ సీపీని ఆదేశించాలని సిట్‌ కోరింది. ఈ మేరకు సిట్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ అంగీకరించింది.

మరోవైపు ఈ కేసులో బీఎల్‌ సంతోష్‌, శ్రీనివాస్‌కు సిట్‌ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. బీఎల్‌ సంతోష్‌, శ్రీనివాస్‌లకు సిట్‌ ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలని భాజపా నేత ప్రేమేందర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపైనా అత్యవసర విచారణకు హైకోర్టు అంగీకరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని