Inter Exams : ఏప్రిల్‌ 20 నుంచి తెలంగాణ ఇంటర్‌ పరీక్షలు

తెలంగాణలో ఏప్రిల్‌ 20 నుంచి పరీక్షలు నిర్వహించాలని ఇంటర్‌ బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు షెడ్యూల్‌ను ఖరారు చేసింది. ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు ఏప్రిల్‌ 20...

Updated : 07 Feb 2022 20:13 IST

హైదరాబాద్‌ : తెలంగాణలో ఏప్రిల్‌ 20 నుంచి పరీక్షలు నిర్వహించాలని ఇంటర్‌ బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు షెడ్యూల్‌ను ఖరారు చేసింది. ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు ఏప్రిల్‌ 20 నుంచి మే 2 వరకు జరగనున్నాయి. ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఏప్రిల్‌ 21 నుంచి మే 5 వరకు నిర్వహించనున్నారు. ప్రాక్టికల్‌ పరీక్షలను మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 8 వరకు నిర్వహిస్తారు. ఏప్రిల్‌ 11న మానవ విలువలు, 12న పర్యావరణ పరీక్ష నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. 

ఫీజు చెల్లింపు గడువు పెంపు

మరోవైపు డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు తేదీని ఓయూ పొడిగించింది. 1, 3, 5 సెమిస్టర్‌ పరీక్షల ఫీజును ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 14 లోగా చెల్లించేందుకు అనుమతిచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని