TS: ఇంటర్‌ పరీక్షల రుసుం చెల్లింపు తేదీలివే!

తెలంగాణలో ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలను ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్‌ ప్రకటించారు. నేటి నుంచి ఫిబ్రవరి...

Published : 31 Jan 2021 01:30 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలను ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్‌ ప్రకటించారు. నేటి నుంచి ఫిబ్రవరి 11వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. రూ.100 ఆలస్య రుసుంతో ఫిబ్రవరి 22వరకు గడువు ఇవ్వగా.. రూ.500 ఆలస్య రుసుంతో మార్చి 2 వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. రూ.1000 ఆలస్య రుసుంతో మార్చి 9 వరకు.. రూ.2వేల ఆలస్య రుసుంతో మార్చి 16వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు గడువు ఇచ్చినట్లు జలీల్‌ వెల్లడించారు.

ఇవీ చదవండి..

TS: ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

ఎంపీ అర్వింద్‌ హామీ నిలబెట్టుకోవాలి: జీవన్‌రెడ్డి

అఖిలప్రియ సోదరుడి పిటిషన్‌ కొట్టివేత

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని