తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా

తెలంగాణలో కరోనా రెండో దశ వ్యాప్తి రోజు రోజుకూ పెరుగుతోంది.

Updated : 03 Apr 2021 11:06 IST

తాజాగా 1,078 మందికి పాజిటివ్‌

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా రెండో దశ వ్యాప్తి రోజు రోజుకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదవ్వడమే ఇందుకు నిదర్శనం. కాగా యాక్టివ్‌ కేసుల సంఖ్య 7000లకు చేరువైంది. శుక్రవారం 59,705 కరోనా పరీక్షలు నిర్వహించగా..1,078 మందికి పాజిటివ్‌గా తేలింది. రాష్ట్రంలో క్రియాశీల కేసుల సంఖ్య 6,900గా ఉన్నట్లు ప్రభుత్వం బులిటెన్‌ విడుల చేసింది.

తాజాగా కరోనాతో ఆరుగురు మృతి చెందగా.. ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1712కి చేరింది. నిన్న 330 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,116 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. మరోవైపు జీహెచ్‌ఎంసీ పరిధిలో తాజాగా 283 కరోనా కేసులు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లోనూ కరోనా తీవ్రత అధికంగానే కనిపిస్తోంది. నిజామాబాద్‌లో 75, నిర్మల్‌లో 40 , కరీంనగర్‌లో 34 కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని