తెలంగాణలో కొత్తగా 5,186 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. అయితే నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ తక్కువ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో  69,148 నమూనాలను తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. అయితే నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ తక్కువ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో  69,148 నమూనాలను పరీక్షించగా..

Updated : 08 May 2021 18:51 IST

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. అయితే నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ తక్కువ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో  69,148 నమూనాలను పరీక్షించగా.. 5,186 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 4,92,385కి చేరింది. తాజాగా మహమ్మారి కారణంగా 38 మంది ప్రాణాలు కోల్పోగా.. మృతుల సంఖ్య 2,704కి పెరిగింది. ఇవాళ 7,994 మంది వైరస్‌ నుంచి కోలుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో 68,462 క్రియాశీల కేసులు ఉన్నట్లు పేర్కొంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 904 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని