Telangana News: ఊళ్లను వదిలి వెళ్లినవారు తిరిగి వస్తున్నారు: మంత్రి జగదీశ్‌రెడ్డి

తెలంగాణలో ఆకలిని పారద్రోలాం అని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్లనే సాధ్యమయిందని చెప్పారు.

Updated : 27 Feb 2022 12:15 IST

హైదరాబాద్: తెలంగాణలో ఆకలిని పారద్రోలాం అని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్లనే ఇది సాధ్యమయిందని చెప్పారు. ఊళ్లను వదిలి వెళ్లినవారు తిరిగి చేరుకుంటున్నారని మంత్రి తెలిపారు. నగరంలోని ఖైరతాబాద్‌ విశ్వేశ్వరయ్య భవన్‌లో నదుల పరిరక్షణపై రెండో రోజు జాతీయ సదస్సు కొనసాగుతోంది. సదస్సులో పాల్గొన్న జగదీశ్‌రెడ్డి మాట్లాడారు.

‘‘వానలను వాపసు తెచ్చుకోవాలంటే పచ్చదనం పెంచాలని సీఎం చెప్పారు. హైదరాబాద్‌లో మూసీ నది ఆక్రమణలకు గురైంది. మానవులు స్వార్థంతో పర్యవరణాన్ని నాశనం చేస్తున్నారు. సీఎం కృషి వల్లే చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి’’ అని జగదీశ్‌రెడ్డి అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని