Telangana News: గవర్నర్లను ఎలా గౌరవించాలో మాకు తెలుసు: తలసాని

గవర్నర్లను గౌరవించడంలో సీఎం కేసీఆర్‌ అందరికంటే ముందుంటారని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు.

Updated : 09 Apr 2022 14:50 IST

హైదరాబాద్‌: గవర్నర్లను గౌరవించడంలో సీఎం కేసీఆర్‌ అందరికంటే ముందుంటారని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. ఎలాంటి లోటుపాట్లు జరగనప్పుడు విమర్శలు చేయడం సరికాదని చెప్పారు. హైదరాబాద్‌లో తలసాని మీడియాతో మాట్లాడారు. ‘‘గవర్నర్లను ఎలా గౌరవించాలో సీఎంకు, మాకు తెలుసు. గవర్నర్లు వారి పరిమితులకు లోబడి మాట్లాడాలి. మీడియాతో రాజకీయాలు మాట్లాడకూడదు. ప్రధాని, కేంద్ర మంత్రిని కలిసిన తర్వాత మాపై విమర్శలు చేయడమేంటి? ప్రజలు ఎన్నుకున్న, మెజార్టీ ఉన్న ప్రభుత్వాన్ని గవర్నర్‌ ఎలా రద్దు చేస్తారు?

గవర్నర్‌ వ్యవస్థ వద్దని ఎప్పట్నుంచో డిమాండ్‌ ఉంది. గవర్నర్‌కు ఒక పరిధి ఉంది.. ఆ పరిధిని భారత రాజ్యాంగం పెట్టింది. పెద్దల సభలో నియామకాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. భాజపా ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను రాజ్యసభకు పంపడం లేదా? డ్రగ్స్‌ విషయంలో సీఎం ఆగ్రహంగా ఉన్నారు. ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని సీఎం ఆదేశించారు’’ అని తలసాని అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని