Chandrababu - Thummala: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన తెలంగాణ మంత్రి తుమ్మల

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు.

Published : 07 Jul 2024 22:57 IST

హైదరాబాద్‌: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ హైదరాబాద్‌లో అయ్యారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాలకు మేలు చేకూర్చే రోడ్లు, జలవనరులు, రైల్వే లైన్లపై చర్చించారు. భద్రాచలం ఐదు గ్రామాల విలీనం ఆవశ్యకతను మంత్రి తుమ్మల.. సీఎంకు వివరించారు. పట్టిసీమ నుంచి పులిచింతల లింక్‌తో రాయలసీమకు కష్టాలు తీరుతాయన్నారు. రైల్వే లైన్‌తో బొగ్గు రవాణా, పుణ్యక్షేత్రాల సందర్శన సులభమవుతుందని పేర్కొన్నారు. పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని