TSLPRB: దేహదారుఢ్య పరీక్షల్లో అన్యాయం జరిగింది.. హైదరాబాద్‌లో అభ్యర్థుల నిరసన

తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు (TSLPRB) నిర్వహించిన దేహదారుఢ్య పరీక్షల్లో తమకు అన్యాయం జరిగిందంటూ పలువురు అభ్యర్థులు నిరసన వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 4 మీటర్ల లాంగ్ జంప్ (Long Jump) నిర్వహించి అన్యాయం చేశారని అభ్యర్థులు ఆరోపించారు.

Updated : 30 Jan 2023 19:08 IST

హైదరాబాద్: తెలంగాణ స్టేట్‌ లెవెల్‌ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు (TSLPRB) నిర్వహించిన దేహదారుఢ్య పరీక్షల్లో తమకు అన్యాయం జరిగిందంటూ పలువురు అభ్యర్థులు  సోమవారం నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని దిల్‌సుక్‌నగర్‌ నుంచి చైతన్యపురి వరకు అభ్యర్థులు ర్యాలీ నిర్వహించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 4 మీటర్ల లాంగ్ జంప్ (Long Jump) నిర్వహించి అన్యాయం చేశారని అభ్యర్థులు ఆరోపించారు. పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర రాజకీయ పార్టీ నాయకులను కలిసినా సమస్య పరిష్కారం కావడం లేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మెయిన్స్‌లో(Mains) తమకు అవకాశం కల్పించాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని (TS Govt) కోరారు. తమకు జరిగిన అన్యాయాన్ని అసెంబ్లీలో చర్చించి పరిష్కారం చూపించాలని.. లేదంటే శాసనసభను ముట్టడిస్తామని అభ్యర్థులు హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు