Ts Raj Bhavan: పూలదండ ఆరోపణలపై తెలంగాణ రాజ్‌భవన్‌ క్లారిటీ

నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైద్య విద్యార్థిని ప్రీతిని పరామర్శించేందుకు గవర్నర్ పూలదండతో వచ్చారని జరుగుతున్న ప్రచారాన్ని రాజ్ భవన్ తీవ్రంగా ఖండించింది. ప్రచారంపై స్పష్టత ఇస్తూ రాజ్‌భవన్‌ ప్రకటన విడుదల చేసింది.

Updated : 24 Feb 2023 18:28 IST

హైదరాబాద్‌: నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైద్య విద్యార్థిని ప్రీతిని పరామర్శించేందుకు గవర్నర్ పూలదండతో వచ్చారని జరుగుతున్న ప్రచారాన్ని రాజ్ భవన్ తీవ్రంగా ఖండించింది. ఖైరతాబాద్‌లోని హనుమంతుడి గుడిలో సమర్పించడానికి కారులో పూల దండ ఉంచామని స్పష్టం చేసింది. ఈ మేరకు రాజ్‌భవన్‌ నుంచి ప్రకటన వెలువడింది. 

‘‘గవర్నర్ వేరే ప్రదేశాల నుంచి రాజ్‌భవన్‌కు తిరిగి వచ్చేటప్పుడు ఖైరతాబాద్‌లోని హనుమంతుడి గుడికి వెళ్లి రావడం చాలా రోజుల నుంచి ఆనవాయితీగా వస్తోంది. ఈ విషయాన్ని దుష్ప్రచారం చేస్తూ విపరీత అర్థాలు తీయడం సహేతుకం కాదు. అలాగే ప్రీతి త్వరగా కోలుకోవాలని హనుమంతుడి గుడిలో గవర్నర్ ప్రార్థించారు. ఈ ఘటనపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలు సమగ్రంగా దర్యాప్తు జరిపారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గవర్నర్ నిమ్స్ పర్యటనను సరైన దృష్టితో అర్థం చేసుకోవాలి’’ అని ప్రకటనలో పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని