Telangana news: 21న తెలంగాణ మంత్రివర్గ సమావేశం.. రుణమాఫీపై చర్చించే అవకాశం

ఈ నెల 21న తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది.

Published : 19 Jun 2024 18:24 IST

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఈ నెల 21న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సచివాలయంలో జరగనుంది. ఆగస్టు 15లోగా రైతు పంట రుణాల మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. ప్రధానంగా ఇదే అంశంపై క్యాబినెట్‌లో చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రుణమాఫీకి సుమారు రూ.30వేల కోట్లు, రైతుభరోసాకు మరో రూ.7వేల కోట్లు అవసరమవడంతో.. నిధుల సేకరణ ఎలా అనే అంశంపైనా మంత్రివర్గంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్‌ రూపకల్పన, పంటల బీమాపైనా క్యాబినెట్‌ చర్చించనున్నట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని