Published : 28 Apr 2022 22:03 IST

Telangana News: తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ సంచలన తీర్పు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ సంచలన తీర్పు వెల్లడించింది. కోర్టు ధిక్కరణ అభియోగంపై వినియోగదారుల కమిషన్ చరిత్రలో తొలిసారిగా ఓ బిల్డర్‌కు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఘరోండ బిల్డర్స్ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ జె సచ్‌దేవ్‌కు మూడు కేసుల్లో 6 నెలల చొప్పున జైలు శిక్ష విధించింది. ఒక శిక్ష పూర్తయ్యాక మరో శిక్ష అమల్లోకి వస్తుందని రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ఛైర్మన్ జస్టిస్ ఎంఎస్ కే జైశ్వాల్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. 

వివరాల్లోకి వెళ్తే.. వినియోగదారుల నుంచి సొమ్ము వసూలు చేసి ఫ్లాట్లు అప్పగించడం లేదని ఘరోండ బిల్డర్స్‌పై అభియోగం. ముగ్గురు వినియోగదారులు కమిషన్‌ను ఆశ్రయించారు. దీనిపై విచారణ చేసిన కమిషన్‌ ముగ్గురు వినియోదారులకు వడ్డీతో కలిపి వారు చెల్లించిన సొమ్మును తిరిగి చెల్లించాలని 2017లో తీర్పు వెల్లడించింది. సంస్థ సొమ్ము చెల్లించకపోవడంతో ముగ్గురు వినియోగదారులు మళ్లీ రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారణ జరిపిన కమిషన్.. ఘరోండ బిల్డర్స్‌ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. పలుమార్లు అవకాశం ఇచ్చినప్పటికీ సొమ్ము చెల్లించలేదని బిల్డర్‌ను తప్పుబట్టింది. వినియోగదారుల పరిరక్షణ చట్టం ప్రకారం సంస్థ ఎండీ సునీల్ జె. సచ్‌దేవ్‌కు జైలు శిక్ష విధించింది. కోర్టు ధిక్కరణ కింద నెల నుంచి మూడేళ్ల వరకు కమిషన్‌ జైలు శిక్ష విధించవచ్చునని.. హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా దీన్ని గతంలో ధ్రువీకరించిందని కమిషన్ పేర్కొంది.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని