Tamilisai: తెలంగాణ అంటే హైదరాబాద్‌ మాత్రమే కాదు: గవర్నర్‌ తమిళిసై

తెలంగాణ.. అనేక రంగాల్లో ప్రత్యేకత చాటుకుంటోంది అని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. రాజ్‌భవన్‌లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో ఆమె మాట్లాడారు.

Updated : 02 Jun 2023 15:21 IST

హైదరాబాద్: అనేక రంగాల్లో తెలంగాణ ప్రత్యేకత చాటుకుంటోందని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో గవర్నర్‌ మాట్లాడారు. హైదరాబాద్‌ సహజసిద్ధ అనుకూలతతో వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. రాష్ట్రం అంటే హైదరాబాద్ మాత్రమే కాదని.. మారుమూల పల్లెలకు కూడా అభివృద్ధి ఫలాలు అందాలని ఆమె వ్యాఖ్యానించారు.  

‘‘నీళ్లు, నిధులు, నియామకాల ఆకాంక్షలతోనే తెలంగాణ ఉద్యమం వచ్చింది. అంటే కొందరు మాత్రమే కాదు.. అందరూ అభివృద్ధి చెందాలి. జై తెలంగాణ అంటే కేవలం ఒక నినాదం మాత్రమే కాదు. జై తెలంగాణ అంటే ఆత్మగౌరవానికి చిహ్నం. నా జీవితంలో ప్రతి నిమిషం ప్రజల కోసమే. రాష్ట్రానికి జాతీయ స్థాయిలో ఖ్యాతి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాను. రాష్ట్రాభివృద్ధికి ఎన్‌ఆర్‌ఐలు చేయూత అందివ్వాలని కోరుతున్నాను. సరికొత్త తెలంగాణ రాష్ట్రాన్ని ఆవిష్కరించుకుందాం. తెలంగాణను దేశంలోనే నంబర్‌ 1గా తీర్చిదిద్దుకుందాం’’ అని తమిళిసై అన్నారు. 


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని