Rains: తెలంగాణలో 3 రోజులు ఈదురుగాలులు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక
రానున్న మూడు రోజులు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న మూడు రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో మూడు రోజులు పగటి ఉష్ణోగ్రతలు 39 నుంచి 42 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపింది. హైదరాబాద్ తోపాటు చుట్టుపక్కల జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 38 నుంచి 41 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశాలున్నాని పేర్కొంది. ఉత్తర, దక్షిణ ద్రోణి ఈ రోజు పశ్చిమ విదర్భ నుంచి మరఠ్వాడా, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 0.9కి.మీ. ఎత్తులో స్థిరంగా కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Baby: ‘బేబి’ విజయం.. దర్శకుడికి నిర్మాత బహుమానం.. అదేంటంటే?
-
Postal Jobs: పోస్టల్లో 30,041 ఉద్యోగాలు.. రెండో షార్ట్‌లిస్ట్ ఇదిగో!
-
Janasena: ‘ఎందుకు ఆంధ్రాకు జగన్ వద్దంటే..’: జనసేన పొలిటికల్ కార్టూన్
-
TCS: టీసీఎస్ కీలక నిర్ణయం.. ‘హైబ్రిడ్’కు గుడ్‌బై..!
-
Crime News: ఎన్సీఆర్బీ పేరిట ఫేక్ మెసేజ్.. విద్యార్థి ఆత్మహత్య.. ఇంతకీ ఆ మెసేజ్‌లో ఏముంది?
-
Maneka Gandhi: మేనకా గాంధీపై ఇస్కాన్ రూ.వంద కోట్ల పరువు నష్టం దావా