Telangana news: ఫిబ్రవరి 3 నుంచి బడ్జెట్‌ సమావేశాలు.. 6న బడ్జెట్‌

ఫిబ్రవరి 3 నుంచి బడ్జెట్‌ సమావేశాలను నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. 6న బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు.

Updated : 30 Jan 2023 22:02 IST

హైదరాబాద్‌: రాష్ట్ర బడ్జెట్‌ (Budget-2023) ఆమోదం విషయంలో తెలంగాణ ప్రభుత్వం, రాజ్‌భవన్‌కు మధ్య ఏర్పడిన సందిగ్ధతకు తెరపడిన నేపథ్యంలో.. బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం తేదీని ఖరారు చేసింది. ఫిబ్రవరి 3 నుంచి బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 3న మధ్యాహ్నం 12.10 గంటలకు అసెంబ్లీలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ బడ్జెట్‌పై ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 6వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది.

హైకోర్టు సూచన మేరకు ఇవాళ మధ్యాహ్నం ప్రభుత్వ, రాజ్‌భవన్‌ తరఫు న్యాయవాదుల మధ్య చర్చల అనంతరం రాజ్యాంగ బద్ధంగా బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పష్టత వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంతరెడ్డితోపాటు పలువురు అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి ప్రశాంత్‌రెడ్డితోపాటు కొందరు అధికారులు రాజ్‌భవన్‌కు వెళ్లి బడ్జెట్‌ సమావేశాలపై గవర్నర్‌తో చర్చించారు. ఆ తర్వాతనే బడ్జెట్‌ సమావేశాల తేదీలను ప్రభుత్వం ఖరారు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని