
Updated : 21 Nov 2021 15:54 IST
TS News: పోచారం మనవరాలి పెళ్లి.. హాజరైన కేసీఆర్, జగన్
హైదరాబాద్: తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి మనవరాలి వివాహానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. శంషాబాద్‌లో జరిగిన వివాహానికి తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కేసీఆర్, జగన్ పక్కపక్కనే కూర్చొని కాసేపు ముచ్చటించుకున్నారు.
Tags :