అంతర్జాతీయ తెలుగు మినీ కథల పోటీకి ఆహ్వానం
భీమవరం: ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ తెలుగు చిన్న కథల పోటీ నిర్వహించనున్నట్లు పరిషత్ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ గజల్ శ్రీనివాస్, రెడ్డప్ప ధవేజీ ఓ ప్రకటనలో తెలిపారు. కథ నిడివి చేతిరాతలో A4లో రెండున్నర పేజీలు, డీటీపీలో ఒకటిన్నర పేజీ మించకూడదని, పేజీకి ఒకవైపు మాత్రమే రాయాలని సూచించారు. ‘దస్తూరి స్పష్టంగా ఉండాలి. ఒకరు ఒక్క కథ మాత్రమే పంపాలి. ఈ కథలు తెలుగు భాష లేదా భారతీయత.. వీటిలో ఏదో ఒక అంశం మీద మాత్రమే రాయాలి. హామీ పత్రంలో కథ తమ సొంత రచన అని పేర్కొనడంతో పాటు ఇంతకుముందు ఎందులోనూ ప్రచురితం గానీ, ప్రసారం గానీ అవ్వలేదని తెలియజేయాల్సి ఉంటుంది. ఏ ఇతర పోటీలకు కూడా పంపలేదని పేర్కొనడం తప్పనిసరి’ అని నిర్వాహకులు సూచించారు. హామీ పత్రంలో తప్ప కథ పేజీలో ఎక్కడా రచయిత పేరు, వివరాలు ఉండకూడదని, అందులో రచయిత పూర్తి పేరు, చిరునామా, వాట్సాప్ ఫోన్ నంబర్, మెయిల్ ఐడీ విధిగా పొందుపరచాలన్నారు.
కథలను డాక్టర్ ఎస్ఆర్ఎస్ కొల్లూరి, సమన్వయకర్త, ఆంధ్ర సారస్వత పరిషత్, 11-1-4, SBI మోబర్లీపేట బ్రాంచ్ బిల్డింగ్, మెయిన్ రోడ్, అమలాపురం-533201 చిరునామాకు పంపాలని సూచించారు. ప్రవాస భారతీయులు dr.srskolluri@gmail.comకి జూన్ 25వ తేదీలోపు మెయిల్ చేయాలని కోరారు. విజేతల వివరాలను జులై 8న, 10.30 గంటలకు జరిగే అంతర్జాల కథా సదస్సులో తెలియజేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆంధ్ర సారస్వత పరిషత్ facebook pageలో వీక్షించొచ్చు. అదేరోజు విజేతలకు ప్రథమ బహుమతిగా ₹3,000, ద్వితీయ బహుమతిగా ₹2,000, తృతీయ బహుమతిగా ₹1,000, రెండు ప్రత్యేక బహుమతులుగా ₹500 నగదుతో పాటు ప్రశంసాపత్రాలు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Liger: షారుఖ్ సూపర్‌హిట్‌ని గుర్తు చేసిన ‘లైగర్’ జోడీ..!
-
General News
Monkey pox: మంకీపాక్స్ ప్రమాదకరం కాదు కానీ... ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
Politics News
Eknath Shinde : శివసేన కోసం కొత్త భవనం నిర్మించనున్న శిందే వర్గం..?
-
India News
ఇదొక ‘లంచం.. మంచం ప్రభుత్వం’.. కర్ణాటక మాజీ మంత్రి వ్యాఖ్యలపై దుమారం!
-
Politics News
Telangana News: అక్కడెందుకు సీఎం కేసీఆర్ పర్యటించలేదు?: కోదండరామ్
-
India News
Modi: మిమ్మల్ని కలుసుకోవాలని అప్పుడే అనుకున్నాను..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Rishi Sunak: ఆయన నా ఫోన్ కాల్స్‌కు స్పందించడం లేదు: రిషి సునాక్
- Offbeat: ఆ విమానంలో జర్నీ కేవలం ఒక్క నిమిషమే.. ధరెంతో తెలుసా..?
- Karthikeya 2 Review: రివ్యూ: కార్తికేయ-2
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (13/08/2022)
- Best catches: విండీస్ ఆటగాళ్ల మెరుపు ఫీల్డింగ్.. ఒకే మ్యాచ్‌లో మూడు సంచలన క్యాచ్‌లు!
- Himanta Biswa Sarma: ఆమిర్ ఖాన్.. మీరు మా రాష్ట్రానికి ఆగస్టు 15 తర్వాతే రండి..!
- F3: ‘ఎఫ్-3’.. వెంకీ ఎలా ఒప్పుకొన్నాడో ఏంటో: పరుచూరి గోపాలకృష్ణ
- Ranveer singh: న్యూడ్ ఫొటోషూట్.. రణ్‌వీర్‌సింగ్ ఇంటికి పోలీసులు!
- Naga Chaitanya: సినిమా మధ్యలోనే ప్రేక్షకులు బయటకు వచ్చేశారు.. బాధేసింది: నాగచైతన్య
- SCR: చుట్టూ చూడొచ్చు.. చుక్కలూ లెక్కెట్టొచ్చు.. ద.మ.రైల్వేలో తొలి రైలు