APSRTC: ఆర్టీసీ ఆన్‌లైన్‌ టికెట్‌ మెసేజ్‌లో డ్రైవర్‌ ఫోన్‌ నంబరు వద్దని ఆదేశాలు

ఆర్టీసీలో దూరప్రాంత సర్వీసులకు ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ టికెట్లు బుక్‌ చేసుకునే వారికి ప్రయాణ

Published : 16 Sep 2021 07:20 IST

ఈనాడు, అమరావతి: ఆర్టీసీలో దూరప్రాంత సర్వీసులకు ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ టికెట్లు బుక్‌ చేసుకునే వారికి ప్రయాణ అప్రమత్తత (జర్నీ అలెర్ట్‌)పై సెల్‌ఫోన్‌కు పంపే ఎస్‌ఎంఎస్‌లో ఇకపై డ్రైవర్‌ ఫోన్‌నంబరు ఇవ్వకూడదని యాజమాన్యం ఆదేశాలు జారీచేసింది. డ్రైవరు, ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఆర్టీసీ సెంట్రల్‌ కంప్లైంట్‌ సెల్‌ హెల్ప్‌లైన్‌ నంబరు 08662570005 మాత్రమే ఇవ్వాలని ఆపరేషన్స్‌ ఈడీ అన్ని జోన్ల ఈడీలకు బుధవారం ఆదేశాలిచ్చారు. ఈ అంశంపై తాము చేసిన విజ్ఞప్తికి యాజమాన్యం సానుకూలంగా స్పందించిందని ఎంప్లాయీస్‌ యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై.వి.రావు, దామోదరరావు ఓ ప్రకటనలో హర్షం ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని