300 కుక్కపిల్లల్ని చంపేసిన వానరాలపట్టివేత.. ఘటనపై మీమ్స్‌ వెల్లువ!

మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లాలో బీభత్సం సృష్టిస్తూ.. కుక్కపిల్లల్ని చంపేస్తున్న రెండు వానరాలను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు......

Updated : 20 Dec 2021 10:19 IST

ముంబయి: మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లాలో బీభత్సం సృష్టిస్తూ.. కుక్కపిల్లల్ని చంపేస్తున్న రెండు వానరాలను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. వాటిని నాగ్‌పుర్‌కు తరలించి అక్కడి అడవిలో విడిచిపెట్టనున్నారు. ‘అనేక కుక్కపిల్లలను చంపేసిన రెండు కోతులను నాగ్‌పూర్ అటవీ శాఖ బృందం పట్టుకుంది’ అని బీడ్ జిల్లా అటవీశాఖ అధికారి సచిన్ కంద్ వెల్లడించారు.

బీడ్‌ జిల్లా మజల్‌గావ్‌ తాలుకా లావుల్‌ గ్రామంలో నెల రోజుల నుంచి దాదాపు 300 కుక్క పిల్లలను వానరాలు చంపేశాయి. గ్రామంలో ఉంటున్న రెండు కోతులు కుక్కపిల్లలను ఎత్తయిన చెట్లపైకి, భవనాలపైకి తీసుకెళ్లి అక్కడి నుంచి కిందకు వదిలేస్తున్నాయి. దీంతో అవి చనిపోతున్నాయి. అప్పటికీ మృతిచెందకపోతే మళ్లీ తీసుకెళ్లి కిందకు విసిరేస్తున్నాయి. అయితే గ్రామంలోని శునకాలు గతంలో ఓ కోతి పిల్లను చంపేశాయని, ఇది చూసిన వానరాలు కుక్కలపై పగ పెంచుకుని ఇలా చేస్తున్నాయని గ్రామస్థులు అంటున్నారు. కాగా ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో ఈ అంశంపై మీమ్స్‌ వెల్లువెత్తున్నాయి.









Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు