అరుదైన వ్యాధి: చిన్నారి వైద్యానికి రూ.22 కోట్లు కావాలి..

అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి మరో 2 నెలల్లో తగిన మందు అందించాలి. వ్యాక్సిన్‌ను అమెరికా నుంచి రప్పించడానికయ్యే మొత్తం ఖర్చు రూ.22 కోట్లు. ఇది మధ్యతరగతి దంపతులను హతాశులను చేసింది. తమ చిన్నారి కోసం తమవంతు ప్రయత్నాలు చేస్తూ దాతల ఔదార్యం కోసం ఎదురు చూస్తున్నారు

Updated : 25 Aug 2021 09:13 IST

తల్లడిల్లుతున్న మధ్యతరగతి దంపతులు

చిన్నారి భారతితో తల్లిదండ్రులు

చెన్నై, న్యూస్‌టుడే: అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి మరో 2 నెలల్లో తగిన మందు అందించాలి. వ్యాక్సిన్‌ను అమెరికా నుంచి రప్పించడానికయ్యే మొత్తం ఖర్చు రూ.22 కోట్లు. ఇది మధ్యతరగతి దంపతులను హతాశులను చేసింది. తమ చిన్నారి కోసం తమవంతు ప్రయత్నాలు చేస్తూ దాతల ఔదార్యం కోసం ఎదురు చూస్తున్నారు. తంజావూర్‌ జిల్లా నాంజికోట్టైకు చెందిన జగదీశ్‌, ఎళిలరసి దంపతుల ఏడాదిన్నర కుమార్తె భారతి. ఆ చిన్నారి నిలబడలేక ఇంకా దోగాడుతూనే ఉండటంతో వేలూరులోని సీఎంసీ ఆస్పత్రిలో చూపించారు. జులైలో పరీక్షలు నిర్వహించగా దాని నివేదిక వారం కిందట అందింది. ఆ చిన్నారి ‘స్పైనల్‌ మస్కులర్‌ ఆట్రోఫీ టైప్‌-2’ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోందని తెలిసింది. మందు ఖరీదు రూ.16 కోట్లు కాగా దిగుమతి పన్ను రూ.6 కోట్లతో కలిపి రూ.22 కోట్లు ఖర్చవుతోందని వెల్లడించారు. చిన్నారి కోసం జగదీశ్‌, ఎళిలరసి స్థాయికి మించి ప్రయత్నాలు చేపట్టారు. సెప్టెంబరులో మందును తెప్పించాలని వైద్యులు చెప్పారని, రోజులు దగ్గరపడటంతో తమలో ఆందోళన మరింత పెరుగుతోందని ‘న్యూస్‌టుడే’తో జగదీశ్‌ తెలిపారు. ఇప్పటివరకు రూ.కోటి అందాయని పేర్కొన్నారు. తమ దైన్యాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దిగుమతి పన్ను రద్దు చేయించడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని