Visakhapatnam: విశాఖలో 29 మంది కౌంటింగ్‌ ఏజెంట్లకు కరోనా 

విశాఖ జిల్లాలో మరోసారి కరోనా కలకలం రేపింది. ఆదివారం జరగనున్న ప్రాదేశిక ఓట్ల లెక్కింపులో పాల్గొననున్న కౌంటింగ్‌ ఏజెంట్లు కరోనా బారిన పడ్డారు. 90 మంది

Updated : 19 Sep 2021 00:53 IST

విశాఖపట్నం: విశాఖ జిల్లాలో మరోసారి కరోనా కలకలం రేపింది. నేడు జరగనున్న ప్రాదేశిక ఓట్ల లెక్కింపులో పాల్గొననున్న కౌంటింగ్‌ ఏజెంట్లు కరోనా బారిన పడ్డారు. 90 మంది కౌంటింగ్‌ ఏజెంట్లకు శనివారం కరోనా పరీక్షలు నిర్వహించగా 29 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కరోనా వచ్చిన వారిని వెంటనే ఐసొలేట్‌ చేయాలని విశాఖ జేసీ ఆదేశించారు. రెండు డోసుల టీకా తీసుకున్న వారినే కౌంటింగ్‌ ఏజెంట్లుగా తీసుకుంటామని వెల్లడించారు. ర్యాపిడ్‌ టెస్టులో నెగిటివ్‌ వచ్చిన వారిని మాత్రమే కౌంటింగ్‌ ఏంజెట్లుగా అనుమతిస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఉదయం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈనేపథ్యంలో కౌంటింగ్‌ ఏజెంట్లకు కొవిడ్‌ టెస్టులు చేయడంతో కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 55,525 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా 1,174 మందికి పాజివ్‌గా తేలింది. కరోనాతో శుక్రవారం గుంటూరు జిల్లాలో ముగ్గురు, చిత్తూరులో ఇద్దరు, కడప, కృష్ణా, ప్రకాశం, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని