AP News: విజయవాడ నుంచి రెండో అతిపొడవైన గూడ్స్‌ రైలు ప్రారంభం

బొగ్గు రవాణా కోసం దేశంలోనే రెండో అతిపొడవైన ‘బ్రహ్మాస్త్ర’ గూడ్సు రైలును దక్షిణ మధ్య రైల్వే నడుపుతోంది.

Updated : 03 Nov 2021 16:31 IST

విజయవాడ: బొగ్గు రవాణా కోసం దేశంలోనే రెండో అతిపొడవైన ‘బ్రహ్మాస్త్ర’ గూడ్సు రైలును దక్షిణ మధ్య రైల్వే నడుపుతోంది. విజయవాడ రైల్వేస్టేషన్‌ నుంచి ఈ రైలు బుధవారం ప్రారంభమైంది. మొత్తం నాలుగు ఇంజిన్లు, 234 బోగీలతో విజయవాడ నుంచి ఒడిశాలోని తాల్చేరుకు బయల్దేరింది. బొగ్గు కొరతను అధిగమించేందుకు దక్షిణ మధ్య రైల్వే ఈ గూడ్స్‌ రైలును నడుపుతోంది. దీని వేగం గంటలకు 20 కిలో మీటర్ల నుంచి 50కిలోమీటర్లకు పెంచినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని