రైతుకు ఐదుగురు ఆడపిల్లలు.. అందరూ ప్రభుత్వ ఉద్యోగులే..

ప్రభుత్వ ఉద్యోగం కొడితే ఆ కిక్కే వేరు. ఇటు కుటుంబం.. అటు ఉద్యోగం పొందిన వారి ఆనందం వర్ణించలేం. ఆ తర్వాత పొందే హోదా, జీతం, గౌరవం అదనం. ఐదుగురు అక్కాచెల్లెళ్లు ఉన్న ఓ కుటుంబంలో...

Published : 15 Jul 2021 17:17 IST

జైపూర్‌: ప్రభుత్వ ఉద్యోగం కొడితే ఆ కిక్కే వేరు. ఇటు కుటుంబం.. అటు ఉద్యోగం పొందిన వారి ఆనందం వర్ణించలేం. ఆ తర్వాత పొందే హోదా, జీతం, గౌరవం అదనం. ఐదుగురు అక్కాచెల్లెళ్లు ఉన్న ఓ కుటుంబంలో ఇప్పుడివి పుష్కలంగా ఉన్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే..

ఇటీవల రాజస్థాన్‌ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌( ఆర్‌ఏఎస్‌) పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి. అందులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు విజేతలుగా నిలిచారు. అప్పటికే వీళ్ల ఇద్దరి తోబుట్టువులు ఆర్‌ఏఎస్‌ సాధించి అధికారిణిలుగా ఉండటం మరో విశేషం. ఈ విషయాన్ని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌ అధికారి పర్వీన్‌ కాస్వాన్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. 

‘రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌కు చెందిన అన్షు, రీతు, సుమన్ ఆర్‌ఏఎస్‌కు ఎంపికయ్యారు. ముగ్గురు ఒకేసారి ఈ విజయాన్ని సాధించడం చాలా గొప్పవిషయం. వారి తండ్రి, కుటుంబం గర్వపడేలా చేశారు. వారు మొత్తం ఐదుగురు అక్కాచెల్లెళ్లు. మిగతా ఇద్దరు రోమా, మంజు. వారిద్దరు ఇప్పటికే ఆర్‌ఏఎస్‌ అధికారిణిలుగా ఉన్నారు. వాళ్ల తండ్రి సహదేవ్‌ సహరన్ ఒక రైతు. ఇప్పుడు ఆయన బిడ్డలందరూ అధికారిణులే’ అని కాస్వాన్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇక, ఆర్‌ఏస్‌ తుది పరీక్షా ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. విజేతలుగా నిలిచినవారికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్ ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని