AP News: దసరాకు 4వేల ప్రత్యేక బస్సులు.. 50శాతం అదనపు ఛార్జీలు: ఆర్టీసీ ఎండీ

ఏపీలో దసరా రద్దీ దృష్ట్యా 4 వేల ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు.

Updated : 06 Oct 2021 14:18 IST

అమరావతి: ఏపీలో దసరా రద్దీ దృష్ట్యా 4 వేల ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. ఈ నెల 8 నుంచి 18 వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని వివరించారు. ఈ ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు ఛార్జీలు ఉండనున్నట్లు ఆయన తెలిపారు. ఒకవైపే రద్దీతో నష్టం రాకుండా ఉండేందుకు అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నామన్నారు. కేవలం ప్రత్యేక బస్సుల్లోనే అదనపు ఛార్జీలు ఉంటాయని ప్రజలు గమనించాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని