TS News: గురుకులంలో 43 మందికి కరోనా

సంగారెడ్డి జిల్లా ముత్తంగి గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేగింది. 42 మంది విద్యార్థులు,

Updated : 29 Nov 2021 14:53 IST

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ముత్తంగి గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేగింది. 42 మంది విద్యార్థులు, ఒక ఉపాధ్యాయురాలు కరోనా బారినపడ్డారు. ఈ గురుకుల పాఠశాలలో 491 మంది విద్యార్థులు, 27 మంది సిబ్బంది ఉన్నారు. నిన్న 261 మంది విద్యార్థులు, 27 మంది సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 43 మందికి కొవిడ్‌ నిర్ధరణ అయింది. మిగతా వారికి ఇవాళ కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

పాజిటివ్‌ వచ్చిన వారి నమూనాలను వైద్యాధికారులు జీనోమ్‌ స్వీక్వెన్సింగ్‌కు పంపారు. వసతి గృహంలోనే క్వారంటైన్‌లో ఉంచి విద్యార్థులకు వైద్యసేవలు అందిస్తున్నారు. కరోనా బారిన పడిన విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యారోగ్యశాఖ తెలిపింది. మూడు రోజుల క్రితం ఓ విద్యార్థిని అస్వస్థతకు గురి కావడంతో వైద్య పరీక్షలు నిర్వహించగా కొవిడ్‌ నిర్ధరణ అయింది. దీంతో నిన్న విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించగా 43 మందికి పాజిటివ్‌గా తేలింది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని