Corona Virus: గర్భిణులకు కొవిడ్‌ సోకితే ముందే ప్రసవం!

కొవిడ్‌-19 బారినపడిన గర్భిణులకు నెలలు నిండకుండానే కాన్పు అయ్యే ముప్పు చాలా ఎక్కువగా ఉంటుందని అమెరికాలో జరిగిన అధ్యయనంలో వెల్లడైంది....

Updated : 11 Aug 2021 09:37 IST

లాస్‌ ఏంజెలెస్‌: కొవిడ్‌-19 బారినపడిన గర్భిణులకు నెలలు నిండకుండానే కాన్పు అయ్యే ముప్పు చాలా ఎక్కువగా ఉంటుందని అమెరికాలో జరిగిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ వివరాలు ‘ద లాన్సెట్‌ రీజినల్‌ హెల్త్‌’లో ప్రచురితమయ్యాయి. అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు.

రోనా సోకిన గర్భిణులకు.. గర్భం ధరించిన 32 వారాల లోపే కాన్పు అయ్యే అవకాశం 60 శాతం ఎక్కువని శాస్త్రవేత్తలు తెలిపారు. 37 వారాల లోపు ప్రసవం జరిగేందుకు 40 శాతం అవకాశం ఎక్కువగా ఉంటుందని వివరించారు. కొవిడ్‌-19తోపాటు అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం వంటి సమస్యలున్న గర్భిణులకు నెలలు నిండకుండా కాన్పు అయ్యే ముప్పు 160 శాతం ఎక్కువని  పరిశోధనకు నాయకత్వం వహించిన డెబోరా కారాసెక్‌ తెలిపారు. గర్భిణులకు తప్పనిసరిగా టీకాలు వేయాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు