Disha Case: ‘నేను చెప్పలేను.. నాకు తెలియదు..’

చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై జస్టిస్‌ సిర్పుర్కర్‌ నేతృత్వంలోని త్రిసభ్య కమిషన్‌ మంగళవారం ఇన్‌స్పెక్టర్‌ నర్సింహారెడ్డిని విచారించింది. పోలీస్‌ అధికారి వద్ద ఉన్న ఆయుధాన్ని లాక్కోవడం సులభంగా సాధ్యమవుతుందా? ఆయుధాన్ని

Updated : 27 Oct 2021 08:53 IST

ఈనాడు, హైదరాబాద్‌: చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై జస్టిస్‌ సిర్పుర్కర్‌ నేతృత్వంలోని త్రిసభ్య కమిషన్‌ మంగళవారం ఇన్‌స్పెక్టర్‌ నర్సింహారెడ్డిని విచారించింది. పోలీస్‌ అధికారి వద్ద ఉన్న ఆయుధాన్ని లాక్కోవడం సులభంగా సాధ్యమవుతుందా? ఆయుధాన్ని వినియోగించడం తెలియని వ్యక్తి అంత సులువుగా అన్‌లాక్‌ చేయగలడా? లాంటి పలు ప్రశ్నలడిగారు. పలు సందర్భాల్లో నర్సింహారెడ్డి ‘నేను చెప్పలేను.. నాకు తెలియదు..’ అంటూ బదులిచ్చారు. ఈ క్రమంలో నర్సింహారెడ్డిని కమిషన్‌ బుధవారమూ విచారించనుంది. బుధవారం విచారణకు వచ్చేటప్పుడు లోడ్‌ చేసిన 9 ఎంఎం పిస్టల్‌ను పౌచ్‌లో ధరించి రావాలని కమిషన్‌ ఆదేశించింది.

ముందే నిర్ధారణకొచ్చాం..: అంతకుముందు షాద్‌నగర్‌ అప్పటి ఏసీపీ సురేందర్‌ విచారణ కొనసాగింది. ‘దిశ’ను అత్యాచారం చేసి హత్య చేసినట్లు నిందితుల నుంచి వాంగ్మూలం సేకరించకముందా? లేక తరువాత నిర్ధారణకు వచ్చారా..? అని కమిషన్‌ ప్రశ్నించింది. లభించిన ఆధారాలను బట్టి నిందితుల వాంగ్మూలాల నమోదుకు ముందే నిర్ధారణకు వచ్చామని ఆయన బదులిచ్చారు. అయిదురోజుల విచారణ అనంతరం ఏసీపీ విచారణ మంగళవారం ముగిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని