TS News: యువకులే ఎక్కువ వేధిస్తున్నారు!

మహిళలను వేధిస్తున్న వారిలో 19-24 ఏళ్ల మధ్య యువకులు ఎక్కువగా ఉంటున్నట్లు మహిళా భద్రతా విభాగం వెల్లడించింది. ఎక్కువ మంది మహిళలు ఫోన్‌లలో వేధింపులకు గురవుతున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో షీ టీంల...

Updated : 28 Jul 2021 11:55 IST

మహిళా భద్రతా విభాగం నివేదిక

ఈనాడు, హైదరాబాద్‌: మహిళలను వేధిస్తున్న వారిలో 19-24 ఏళ్ల మధ్య యువకులు ఎక్కువగా ఉంటున్నట్లు మహిళా భద్రతా విభాగం వెల్లడించింది. ఎక్కువ మంది మహిళలు ఫోన్‌లలో వేధింపులకు గురవుతున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో షీ టీంల పనితీరుకు సంబంధించి మంగళవారం విడుదల చేసిన నివేదికలో ఈ విషయాల్ని వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ నెలాఖరు వరకూ 6 నెలల్లో షీ టీంలకు 2,803 ఫిర్యాదులు అందగా.. 1251 మంది నిందితులను గుర్తించినట్లు తెలిపింది. వీటికి సంబంధించి 271 ఎఫ్‌ఐఆర్‌లు, 325 పెట్టీ కేసులు నమోదు చేశారు. 171 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయి. 1048 ఫిర్యాదులను మూసివేశారు. 363 మంది నిందితులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి, 625 మందిని హెచ్చరించి వదిలేశారు. 114 ఘటనల్లో వేధింపులకు పాల్పడుతున్న నిందితులను ‘షీ’ బృందాలు స్వయంగా పట్టుకున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని