
Sleep: రోజుకి అరగంటే నిద్రపోతాడట!
టోక్యో: మనకు రెండు మూడు రోజులు వరుసగా ఓ గంటా రెండు గంటల నిద్ర తగ్గితే ఒంట్లో ఉత్సాహం కూడా తగ్గినట్లనిపిస్తుంది. జపాన్‌కి చెందిన డాయ్‌సుకె హొరి మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. ఇతగాడు గత పన్నెండేళ్లుగా రోజుకి కేవలం అరగంట మాత్రమే నిద్రపోతున్నాడట. స్థానిక ‘షార్ట్ స్లీపర్ అసోసియేషన్(తక్కువగా నిద్రపోయే సంఘం)’కి ఛైర్మన్ అయిన హొరి ఎన్నో ఏళ్లుగా తన నిద్రా సమయాన్ని కొద్ది కొద్దిగా తగ్గించుకుంటూ చివరికి అరగంటకు తెచ్చాడట. అయినా ఏ ఆరోగ్య సమస్యలూ లేవట. ‘మన జీవితంలో చాలా సమయం నిద్రకే వృథా అవుతోంది. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికే మా సంఘంలోని సభ్యులు ప్రయత్నిస్తుంటారు’ అంటాడు హొరి. ‘ఇతడు నిజమే చెబుతున్నాడా’ అని తెలుసుకోవడానికి ఓ టీవీ ఛానెల్ మూడు రోజుల పాటు అతడి దినచర్యను షూట్ చేసింది కూడా.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.