
Model: మద్యం సేవించి.. నడిరోడ్డుపై మోడల్ హల్‌చల్..
భోపాల్: అతిగా మద్యం సేవించిన ఓ మోడల్ గ్వాలియర్ నడిరోడ్డుపై ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించింది. మిలటరీ వాహనాన్ని ఆపి హంగామా సృష్టించింది. దిల్లీకి చెందిన 22 ఏళ్ల మోడల్ గురువారం రాత్రి సమయంలో మద్యం మత్తులో రోడ్డుపైకి వచ్చింది. వాహనాలకు అడ్డుపడుతూ వాహనదారులకు ఇబ్బంది కలిగించింది. రోడ్డుపై నిల్చుని గట్టిగా కేకలు వేసింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న మిలటరీ వాహనాన్ని ఆపి.. జీపుని కాలితో తన్నింది. ఆమె ప్రవర్తనతో ఆగ్రహానికి గురైన ఓ జవాన్.. ఆమెకు నచ్చజెప్పి పక్కకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆమె జవాన్‌ను నెట్టివేసింది. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.