
ఆ తండ్రీబిడ్డకు.. ఇంతకు మించిన అద్భుత క్షణాలుంటాయా..?
లఖ్‌నవూ: ఆ తండ్రికి పుత్రికోత్సాహం.. ఆ బిడ్డకు పట్టలేని ఆనందం.. ఓ తండ్రీకూతుళ్ల గురించి తాజాగా ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసిన దృశ్యాల సారమిది. ఆ తండ్రి పోలీస్ అధికారి కాగా, ఆ బిడ్డ పోలీస్ అధికారిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉంది. తమ ఆనందాన్ని పంచుకునేందుకు ఇద్దరు ఒకరికొకరు సెల్యూట్ చేసుకొని, మురిసిపోయారు. ఇప్పుడు ఈ చిత్రాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
ఆ చిత్రంలో ఉన్న యువతి పేరు ఆపేక్షా నింబాడియా. ఉత్తర్ ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌కు చెందిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పోలీస్ అకాడమీ నుంచి పట్టా పొందారు. దీని తర్వాత ఆమె ఉత్తర్‌ప్రదేశ్ పోలీస్ విభాగంలో డిప్యూటీ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆమె తండ్రి ఏపీఎస్ నింబాడియా. ఆయన ఐటీబీపీలో డిప్యూటీ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ ఫొటోలు ఆపేక్షా పాసింగ్ అవుట్ పరేడ్ సందర్భంగా తీసినవి. ఆ సమయంలో ఆ తండ్రీకూతుళ్లు ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఆ క్షణాల్నే ఐటీబీపీ పోస్టు చేయగా.. నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘మీ ఇద్దరికి సెల్యూట్’, ‘హృదయం ఉప్పొంగే సందర్భం’, ‘జై హింద్’ అని కామెంట్లు పెట్టారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.