Ts News: రొమ్ము క్యాన్సర్‌.. పరీక్షలు చేయించుకునేలా ప్రోత్సహించాలి: రానా దగ్గుబాటి

రొమ్ము క్యాన్సర్‌ పట్ల అవగాహన కల్పించడంతో పాటు పరీక్షలను చేయించుకునే విధంగా ప్రోత్సహించేలా స్కానింగ్‌ సేంటర్లను ఏర్పాటు చేయాలని ప్రముఖ సినీ నటుడు రానా దగ్గుబాటి..

Published : 10 Oct 2021 17:24 IST

హైదరాబాద్: రొమ్ము క్యాన్సర్‌ పట్ల అవగాహన కల్పించడంతో పాటు పరీక్షలను చేయించుకునే విధంగా ప్రోత్సహించేలా స్కానింగ్‌ సేంటర్లను ఏర్పాటు చేయాలని ప్రముఖ సినీ నటుడు రానా దగ్గుబాటి అన్నారు. గచ్చిబౌలిలోని ఆంకో క్యాన్సర్ సేంటర్‌లో పింక్‌ కాన్వాస్‌ పేరిట నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రానా.. పింక్ క్యాన్వాస్ బ్రోచర్‌ను విడుదల చేశారు. అనంతరం రానా మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో అతి ముఖ్యమైన ప్రజారోగ్య సమస్యగా రొమ్ము క్యాన్సర్‌ నిలుస్తుంది. హైదరాబాద్‌ లాంటి మెట్రో నగరాల్లో రొమ్ము క్యాన్సర్‌ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. 45 సంవత్సరాలు దాటిన మహిళలు తప్పనిసరిగా క్యాన్సర్‌ పరీక్షలు చేయించుకోవాలి. ఈ కార్యక్రమంలో ఆంకో డాట్‌ కామ్‌ సహ వ్యవస్థాపకులు, చీఫ్‌ ఆంకాలజిస్ట్‌ డా. అమిత్‌ జొత్వానీ, డా. శిఖర్‌ కుమార్‌ (మెడికల్‌ ఆంకాలజిస్ట్‌), డా. రవిచంద్ర.వి (సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌), డా. లలితా రెడ్డి.కె (రేడియేషన్‌ ఆంకాలజిస్ట్‌) తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని