AP High Court: రాజధాని వ్యాజ్యాలపై విచారణ వాయిదా

రాజధాని వ్యాజ్యాలపై విచారణ వాయిదా పడింది. నవంబరు 15కి వాయిదా వేస్తూ సీజే ధర్మాసనం నిర్ణయం తీసుకుంది.

Updated : 23 Aug 2021 15:38 IST

అమరావతి: రాజధాని వ్యాజ్యాలపై విచారణ వాయిదా పడింది. నవంబరు 15కి వాయిదా వేస్తూ సీజే ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా విచారణ వాయిదా వేయాలని పిటిషనర్లు, వాళ్ల తరఫు న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దేశంలో పరిస్థితుల దృష్ట్యా హైకోర్టే నిర్ణయం తీసుకోవాలని.. ప్రభుత్వ న్యాయవాదులు వాయిదా నిర్ణయాన్ని కోర్టుకే వదిలేశారు. దేశంలో, రాష్ట్రంలో నమోదవుతున్న కేసులను పరిగణనలోకి తీసుకొని సీజే ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.

పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన రాజధాని వ్యాజ్యాలపై చీఫ్‌ జస్టిస్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఏడాది మార్చి 26న మొదటిసారి విచారణ జరిపింది. అప్పుడు తదుపరి విచారణను మే 3కు వాయిదా వేసింది. ఆ రోజు వ్యాజ్యాలు విచారణకు రాగా కొవిడ్‌ నేపథ్యంలో న్యాయవాదుల అభ్యర్థన మేరకు ఇవాళ్టికి ధర్మాసనం వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై ఇవాళ కూడా విచారణ జరిగి మరోసారి వాయిదా పడింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని