Milk: పాలలో కల్తీ... ఆవిరితో గుర్తించొచ్చు

పాలలో కలిపే నీరు, తెల్లటి నురగ రప్పించే లవణాల(యూరియా)ను

Updated : 28 Oct 2021 11:52 IST

ఈనాడు డిజిటల్, బెంగళూరు: పాలలో కలిపే నీరు, తెల్లటి నురగ రప్పించే లవణాల(యూరియా)ను గుర్తించే సులువైన విధానాన్ని బెంగళూరులోని భారతీయ విజ్ఞాన సంస్థ (ఐఐఎస్‌సీ) ఆవిష్కరించింది. ఈ సంస్థ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన పోస్ట్‌ డాక్టరల్‌ విద్యార్థి వివేకేశ్వర్‌ కుమార్‌ ఈ విధానాన్ని రూపొందించారు. ఆటోమేషన్‌ సాంకేతికతతో రూపొందించిన ఈ విధానంలో మొబైల్‌ యాప్‌ ద్వారా పాల ఆవిరి విన్యాసాలతో కల్తీని కనిపెట్టొచ్చు. నీరు, యూరియా కలిపిన పాలు విభిన్నంగా భాష్పీభవనం చెందుతాయి.

ప్రస్తుతం ల్యాక్టోమీటర్‌ ద్వారా పాలలో కలిపే నీటి ప్రమాణాన్ని గుర్తిస్తారు. 3.5% కంటే తక్కువ ప్రమాణంలో నీరు కలిపితే కల్తీని పసిగట్టే వీలులేదు. యూరియా ప్రమాణాలను బయో సెన్సార్ల ద్వారా గుర్తిస్తున్నా అది ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని వివేకేశ్వర వివరించారు. ఆటోమేషన్‌ సాంకేతికతతో రూపొందించిన ఇమేజ్‌ అనాలసిస్‌ సాఫ్ట్‌వేర్‌ మొబైల్‌లో పాల ఆవిరి విన్యాసాలను చిత్రీకరించి వాటి ద్వారా కల్తీని గుర్తించవచ్చు. పాలలో కలిపిన 0.4% నీటిని కూడా ఈ సాఫ్ట్‌వేర్‌తో గుర్తించే వీలుందని ఆయన వెల్లడించారు. అతి తక్కువ ఖర్చుతో ఏమాత్రం సాంకేతిక పరిజ్ఞానం లేని వారు కూడా ఈ సాఫ్ట్‌వేర్‌తో కల్తీని గుర్తించే వీలుందని తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని