Hyderabad News: అరుదైన వస్తు సంపదకు వెలకట్టలేం: శ్రీనివాస్‌గౌడ్‌

చరిత్రకు ప్రతీకగా నిలిచే పురాతన వారసత్వ వస్తు సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. అనాటి అరుదైన వస్తు సంపదను..

Updated : 14 Aug 2021 19:37 IST

హైదరాబాద్‌: చరిత్రకు ప్రతీకగా నిలిచే పురాతన వారసత్వ వస్తు సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. అనాటి అరుదైన వస్తు సంపదను సంరక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకొని భద్రపరుస్తామని వెల్లడించారు. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో ‘అద్య కళ’ పేరిట ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను మంత్రి సందర్శించారు. ఆదివాసీ, గిరిజనులు వినియోగించిన పలు వాయిద్య పరికరాలు, కళారూపాలు, వివిధ ఆకృతులను ఒక్క చోట చేర్చి ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రదర్శనలోని వాయిద్య సాధనాలు, విగ్రహాలు, వివిధ ఆకృతులు, చిత్రాలను భద్రపరిచేందుకు ప్రత్యేక మ్యూజియం ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. ఇలాంటి ఆరుదైన వస్తు సంపదకు వెలకట్టలేమన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని