TS News: నేటి నుంచి గురుకులాలు ప్రారంభం: విద్యాశాఖ కార్యదర్శి
కరోనా వ్యాప్తి నేపథ్యంలో గత విద్యా సంవత్సరం నుంచి మూసివేసిన గురుకులాలు తెరుచుకోనున్నాయి. గురుకులాలు తెరిచేందుకు హైకోర్టు అనుమతిచ్చిన నేపథ్యంలో విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా...
హైదరాబాద్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో గత విద్యా సంవత్సరం నుంచి మూసివేసిన గురుకులాలు తెరుచుకోనున్నాయి. గురుకులాలు తెరిచేందుకు హైకోర్టు అనుమతిచ్చిన నేపథ్యంలో విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా అన్ని గురుకులాల కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. నేటినుంచి అన్ని గురుకులాలు, కస్తూర్బా, మోడళ్లు స్కూళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు, కళాశాలలు ప్రారంభించడానికి నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు జారీ చేశారు. పాఠశాలలు, వసతి గృహాలు, భోజనాల గదులు శానిటైజ్ చేయాలని సూచించారు. కొవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని, అనారోగ్య సమస్యలు ఉంటే పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులు కొవిడ్ టీకాలు తీసుకోవాలని, టీకాలు తీసుకున్నవారే బోధన చేయాలని సందీప్ కుమార్ సుల్తానియా ఆదేశించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
-
Ts-top-news News
తెలంగాణలో మరోదఫా ఓటర్ల జాబితా సవరణ
-
Sports News
ఆ మార్పులు కలిసొచ్చాయి: గిల్
-
Movies News
నాలోని కామెడీ కోణమే.. మెర్క్యురీ సూరి
-
Movies News
Abhiram: భయంతో నిద్ర పట్టడం లేదు.. తేజ అందరి ముందు తిట్టారు: అభిరామ్
-
World News
Ross: 54 ఏళ్ల నిరీక్షణ.. 71 ఏళ్ల వయస్సులో డిగ్రీ పట్టా!