
Amaravati Padayatra: అన్ని వర్గాల మద్దతుతో సాగుతోన్న ‘మహాపాదయాత్ర’
అమరావతి: ఏపీ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రాజధాని రైతులు, మహిళలు చేస్తున్న ‘అమరావతి మహాపాదయాత్ర’ పదో రోజుకు చేరుకుంది. ఇవాళ ప్రకాశం జిల్లా దుద్దుకూరు నుంచి నాగులుప్పలపాడు వరకు 14కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగనుంది. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా చేస్తున్న ఈ యాత్రకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. జై అమరావతి అంటూ నినాదాలు చేస్తూ మహాపాదయాత్ర చేస్తున్న రైతులకు గ్రామగ్రామాన స్థానికులు సంఘీభావం తెలుపుతున్నారు. అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యాత్ర 45 రోజుల పాటు కొనసాగి డిసెంబర్ 15న తిరుమలలో ముగియనుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.