Amaravati Padayatra: అమరావతి రైతుల మహా పాదయాత్రకు పూలబాట

అమరావతినే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ రాజధాని రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర మూడో రోజు దిగ్విజయంగా సాగింది. న్యాయస్థానం

Updated : 03 Nov 2021 19:41 IST

అమరావతి: అమరావతినే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ రాజధాని రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర మూడో రోజు దిగ్విజయంగా సాగింది. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో చేపట్టిన ఈ యాత్ర ఇవాళ గుంటూరు శివారు అమరావతి రోడ్డు నుంచి ప్రారంభమై... పుల్లడిగుంట, వింజనంపాడు గ్రామాల వద్ద ముగిసింది. గుంటూరు జిల్లాలో ప్రజల నుంచి అడుగడుగునా అపూర్వ ఆదరణ లభిస్తోంది. యాత్రకు హారతులు పడుతూ నిరాటంకంగా సాగాలని ఆకాంక్షిస్తున్నారు. గుంటూరు నగరం దాటుకుని సాయంత్రం 4గంటలకు ప్రత్తిపాడు నియోజకవర్గంలోకి అడుగుపెట్టగా..ఏటుకూరు బైపాస్‌ వద్ద స్థానిక ప్రజలు, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, తెలుగుదేశం నాయకులు అఖండ స్వాగతం పలికారు. యాత్రలో కదిలి వస్తున్న వేంకటేశ్వరుడి వాహనంతో పాటు, రైతులు, మహిళలపై బంతిపూలు చల్లుతూ స్వాగతం పలికారు. రాజధాని రైతులను పూల బాటపై నడిపించారు. ఫ్లైఓవర్‌ పైనుంచి పూలు చల్లుతూ యాత్ర విజయవంతం కావాలని నినాదాలు చేశారు. రాజధాని కోసం 33వేల ఎకరాలు త్యాగం చేసిన రైతుల సంకల్పం నెరవేరుతుందని, అమరావతికి ఎలాంటి ఢోకా ఉండదని అభిప్రాయపడ్డారు. అనంతరం పాదయాత్ర పుల్లడిగుంట, వింజనంపాడు చేరుకోగా  మహిళలు గుమ్మడికాయలతో హారతులు ఇచ్చి స్వాగతం పలికారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని