Ap News: శ్రీకాళహస్తిలో కదం తొక్కిన కర్షకులు.. రూ.60లక్షలు విరాళమిచ్చిన కర్ణాటక రైతులు

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి వీధుల్లో కర్షకులు కదం తొక్కారు. అమరావతి ఆకాంక్షను వాయులింగేశ్వరుడి వాకిట చాటుతూ రాజధాని రైతులు 39వ రోజు పాదయాత్రను

Updated : 09 Dec 2021 18:18 IST

శ్రీకాళహస్తి: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి వీధుల్లో కర్షకులు కదం తొక్కారు. అమరావతి ఆకాంక్షను వాయులింగేశ్వరుడి వాకిట చాటుతూ రాజధాని రైతులు 39వ రోజు పాదయాత్రను జోరువానను సైతం లెక్కచేయకుండా కొనసాగించారు. పోలీసుల ఆంక్షలు, అడ్డంకులు, శాంతిభద్రతలకు విఘాతమంటూ చేసిన హెచ్చరికలను సవాల్‌ చేస్తూ వివిధ ప్రజా సంఘాలు, కుల సంఘాలు, వృత్తి సంఘాలతో పాటు అన్ని రాజకీయపక్షాలు పెద్ద ఎత్తున రాజధాని రైతుల మహాపాదయాత్రకు సంఘీభావంగా తరలివచ్చాయి. తెలుగుదేశంతో పాటు జనసైనికులు, భాజపా, సీపీఐ, సీపీఎం శ్రేణులు కలిసికట్టుగా రక్షణకవచంగా ముందుండి పాదయాత్రను నడిపించాయి. సాటి తెలుగువారి వేదన చూసి కర్ణాటక నుంచి యలమంచిలి వెంకటవాసుదేవరావు దంపతుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రవాసాంధ్రులు.. రైతుల మహాపాదయాత్రకు మద్దతు పలికి రూ.60లక్షల విరాళం అందజేశారు. రైతులు పడుతున్న కష్టాలు చూసి గుండె తరుక్కు పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పుట్టిన గడ్డకు తోచిన సాయం చేసేందుకు అంతా కలిసి వచ్చామని స్పష్టం చేశారు. రైతుల పోరాటం గెలవాలన్నదే సాటి రైతులుగా తమ ఆకాంక్ష అని వారు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని