Amaravati Padayatra: పాదయాత్రలో ఉద్రిక్తత.. రోడ్డుపై బైఠాయించి రైతుల నిరసన 

అమరావతి రైతులు, మహిళలు చేస్తున్న ‘మహాపాదయాత్ర’లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు తమ పాదయాత్రను అడ్డుకుంటున్నారని..

Updated : 01 Dec 2021 15:49 IST

మరుపూరు: అమరావతి రైతులు, మహిళలు చేస్తున్న ‘మహాపాదయాత్ర’లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాదయాత్రలో సర్వమతాలకు సంబంధించిన వాహనాలకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకుంటున్నారంటూ నెల్లూరు జిల్లా పొదలకూరు రోడ్డు మరుపూరు వద్ద రోడ్డుపై రైతులు, మహిళలు బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

పాదయాత్ర ప్రారంభం నుంచి వస్తున్న వాహనాలకు లేని అభ్యంతరం ఇప్పుడెందుకని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన కొనసాగించారు. దీంతో ఆ మార్గంలో రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. యాత్రను ముందుకు సాగనీయకుండా పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు నినాదాలు చేశారు. రైతుల నిరసనతో ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఉదయం రైతులు మరుపూరు నుంచి 31వ రోజు యాత్రను ప్రారంభించారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వారికి స్వాగతం పలికారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని