
AMARAVATI NEWS: పానకాల స్వామి ఆలయంలో జై అమరావతి నినాదాలు
అమరావతి: అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని కోరుతూ చేపట్టిన ఉద్యమం 600 రోజుకు చేరుకున్న సందర్భంగా ఆ ప్రాంత రైతులు చేపట్టిన న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు ర్యాలీ ఉద్రిక్తతలకు దారితీసింది. పోలీసు నిర్బంధాలను దాటుకుంటూ కొందరు రైతులు మంగళగిరిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు. జై అమరావతి అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అప్పటికే ఆలయం వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఉద్యమకారులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అమరావతి ఉద్యమాన్ని అణచివేసేందుకు పోలీసులు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఐకాస నేతలు ఆరోపించారు. పోలీసుల చర్య దారుణంగా ఉందంటూ రాజధాని ఐక్యకార్యాచరణ సమితి నేతలు, అమరావతి పరిరక్షణ ఐకాస నేతలు ధ్వజమెత్తారు. ఇంతటి దమనకాండ ఎప్పుడూ చూడలేదని ఆక్షేపించారు. అమరావతి ఉద్యమం 600వ రోజు దుర్దినంగా భావిస్తున్నామన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.