Amaravati Padayatra: వివిధ సంఘాల మద్దతుతో ‘మహాపాదయాత్ర’ ముందుకు 

ఏపీ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని అమరావతి రైతులు, మహిళలు చేస్తున్న ‘మహాపాదయాత్ర’ 27వ రోజు కొనసాగుతోంది.

Updated : 27 Nov 2021 12:58 IST

నెల్లూరు: ఏపీ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని అమరావతి రైతులు, మహిళలు చేస్తున్న ‘మహాపాదయాత్ర’ 27వ రోజు కొనసాగుతోంది. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో చేపట్టిన యాత్ర ఇవాళ నెల్లూరు నుంచి ప్రారంభమైది. శనివారం సందర్భంగా వెంకటేశ్వర స్వామి రథంలో రైతులు ప్రత్యేక పూజలు చేసి యాత్రను మొదలుపెట్టారు. నెల్లూరు బారాషహీద్‌ దర్గా వద్ద రైతులు భోజన విరామం తీసుకోనున్నారు. ఇవాళ 12కి.మీ మేర కొనసాగించే యాత్ర రాత్రి అంబాపురంలో ముగియనుంది.

వర్షంలోనూ రాజధాని రైతులు యాత్రను కొనసాగిస్తున్నారు. ఏకైక రాజధానిగా అమరావతినే ప్రకటించాలని నినాదాలు చేస్తూ స్థానికుల మద్దతులో కదులుతున్నారు. మహాపాదయాత్రకు బార్‌ అసోసియేషన్‌ తరఫున నెల్లూరు న్యాయవాదులు, వివిధ సంఘాలు సంఘీభావం తెలిపాయి.అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యాత్ర 45 రోజుల పాటు కొనసాగనుంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 70 ప్రధాన గ్రామాల మీదుగా డిసెంబర్‌15న తిరుమలకు చేరనుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని