Amaravati Padayatra: తుదిఘట్టానికి అమరావతి ‘మహాపాదయాత్ర’

ఏపీ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రాజధాని రైతులు, 

Updated : 13 Dec 2021 16:11 IST

రేణిగుంట: ఏపీ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రాజధాని రైతులు, మహిళలు చేస్తున్న మహాపాదయాత్ర తుదిఘట్టానికి చేరింది. రైతులు 43వ రోజు పాదయాత్రను రేణిగుంట నుంచి ప్రారంభించారు. ఇవాళ 12 కిలోమీటర్ల మేర సాగనున్న యాత్ర తిరుపతికి చేరుకోనుంది. మరో వైపు ఈ నెల17న తిరుపతిలో తలపెట్టిన బహిరంగ సభ నిర్వహణపై రైతులు నేడు హైకోర్టును ఆశ్రయించనున్నారు. ఇవాళ్టి పాదయాత్రకు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సంఘీభావం తెలిపారు. రైతులతో కలసి వారు పాదయాత్రలో పాల్గొన్నారు. మచిలీపట్నం ప్రజలు పాదయాత్రకు విరాళంగా ఇచ్చిన రూ.12.70లక్షలను కొల్లు రవీంద్ర, కొనకళ్ల నారాయణ  రైతులకు అందజేశారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని