Amaravati Padayatra: నేటితో ముగియనున్న రాజధాని రైతుల ‘మహాపాదయాత్ర’

ఏపీ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రాజధాని రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర నేటితో ముగియనుంది.

Updated : 14 Dec 2021 13:09 IST

తిరుపతి: ఏపీ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రాజధాని రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర నేటితో ముగియనుంది. నవంబర్‌ 1న తుళ్లూరు నుంచి న్యాయస్థానం- దేవస్థానం పేరుతో చేపట్టిన యాత్ర 45వ రోజైన ఇవాళ అలిపిరిలో ముగియనుంది. 44 రోజులుగా రైతులు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 400 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేశారు. ఇవాళ యాత్ర తిరుపతిలో కొనసాగి సాయంత్రం అలిపిరిలో ముగియనుండగా.. రైతులు రేపు, ఎల్లుండి తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ నెల 17న అమరావతి ఆకాంక్షను చాటేలా బహిరంగ సభ నిర్వహించనున్నట్లు అమరావతి ఐకాస నేతలు తెలిపారు.

తెలుగు యువత  నేతల సంఘీభావం

తిరుపతి చేరుకున్న అమరావతి మహాపాదయాత్రకు తెదేపా అనుబంధ విభాగం తెలుగు యువత నేతలు సంఘీభావం తెలిపారు. తిరుపతి పార్లమెంట్‌ తెలుగు యువత అధ్యక్షుడు రవినాయుడు ఆధ్వర్యంలో అమరావతి రైతుల, మహిళలు మద్దతు తెలిపారు. సేవ్‌ అమరావతి, సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్‌ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని