Updated : 15/11/2021 12:18 IST

Amaravati Padayatra: ప్రకాశంలో తొమ్మిదో రోజు ‘మహాపాదయాత్ర’

అమరావతి: ఏపీ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రాజధాని రైతులు, మహిళలు చేపట్టిన యాత్ర 15వ రోజుకు చేరుకుంది. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న యాత్ర ప్రకాశం జిల్లాలో తొమ్మిదో రోజు కొనసాగుతోంది. జరుగుమల్లి మండలంలో మొదలైన ఇవాళ్టి యాత్ర సుమారు 14కి.మీ మేర సాగి కందుకూరు మండలం విక్కిరాలపేటలో ముగియనుంది. అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యాత్రకు స్థానిక ప్రజల నుంచి అపూర్వ మద్దతు లభిస్తోంది.

అమరావతి పరిరక్షణ, ఇతర ప్రాంతాలకు ఉద్యమాన్ని విస్తరించడమే లక్ష్యంగా ప్రారంభించిన మహాపాదయాత్ర.. 45 రోజుల పాటు కొనసాగనుంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 70 ప్రధాన గ్రామాల మీదుగా జరిగే ఈ యాత్ర డిసెంబరు 15న తిరుపతిలో ముగియనుంది.


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని