Anand Mahindra: వారాంతంలో జ్ఞాపకాల లైబ్రరీకి వెళ్లిన మహీంద్రా..!

ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్‌ మహీంద్రా నెట్టింట్లో స్పందించారంటే.. కచ్చితంగా ఏదో కొత్త విషయం మనకు తెలిసినట్లే! లేకపోతే మన పెదాలు చిరునవ్వులైనా చిందిస్తాయి!

Published : 13 Nov 2021 17:30 IST

ముంబయి: ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్‌ మహీంద్రా నెట్టింట్లో స్పందించారంటే.. కచ్చితంగా ఏదో కొత్త విషయం మనకు తెలిసినట్లే! లేకపోతే మన పెదాలు చిరునవ్వులైనా చిందిస్తాయి! అయితే ఈసారి మహీంద్రా తన వ్యక్తిగత విషయాన్ని వెల్లడించారు.  తన యవ్వనంలో గడిపిన జ్ఞాపకాలను మనతో పంచుకున్నారు. ఆ విషయాలను వెల్లడిస్తూ.. టీనేజ్‌లో ఉన్న ఫొటోను షేర్ చేశారు. 

‘నేను యువకుడిగా ఉన్నప్పుడు వారాంతాల్లో ఎలా గడిపేవాడినో మరోసారి గుర్తుచేసుకుంటున్నాను. 1972లో నా వయస్సు 17 సంవత్సరాలు. అప్పుడు నా స్నేహితుడితో కలిసి తరచూ ముంబయి నుంచి పుణె వరకు ట్రక్కుల్లో ప్రయాణించేవాడిని’ అంటూ లాంగ్‌డ్రైవ్‌లో ఉన్న మజాను మహీంద్రా వెల్లడించారు. అలా విహరిస్తూ అప్పుడే విడుదలైన సినిమాలోని పాటలు పాడుకునేవాళ్లమని చెప్పుకొచ్చారు. మహీంద్రా పెట్టిన ఈ పోస్టు ఎంతో మందిని మెప్పించింది. ట్రక్కు పైన కూర్చొని.. ఆకాశాన్ని చూస్తూ.. పక్కనే ఉన్న మన స్నేహితులతో వంకలు తిరిగే రోడ్డుపై ప్రయాణిస్తూ పాటలు పాడుకోవడం ఒక వరమంటూ ఓ నెటిజన్‌ కామెంట్ చేయగా.. కచ్చితంగా అంటూ ఆనంద్  సమాధానమిచ్చారు. మీకూ ఇలాంటి జ్ఞాపకాలున్నాయా..? ఈ వారాంతంలో ఓసారి మీ జ్ఞాపకాల లైబ్రరీకి వెళ్లి, రిఫ్రెష్ అవ్వండి..!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని