Cm jagan: ఏపీ కార్మికులను భారత్‌కు తీసుకురావాలి.. కేంద్ర మంత్రి జైశంకర్‌కు జగన్ లేఖ

బహ్రెయిన్‌లో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ కార్మికులను స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు

Updated : 13 Sep 2021 14:53 IST

అమరావతి: బహ్రెయిన్‌లో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ కార్మికులను స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు జగన్‌ లేఖ రాశారు. బహ్రెయిన్‌లో పనిచేస్తున్న కార్మికుల్లో ఏపీకి చెందినవారు అధికంగా ఉన్నారని లేఖలో వివరించారు. అక్కడ వారిని ఆయా కంపెనీలు ఇబ్బంది పెడుతున్నాయని పేర్కొన్నారు. వారిని త్వరగా భారత్‌కు రప్పించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి జైశంకర్‌కు విజ్ఞప్తి చేశారు. బహ్రెయిన్‌ నుంచి కార్మికులను స్వదేశానికి తీసుకొచ్చే విషయంలో ఏపీ ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఏపీ సీఎంవో కార్యాలయం అధికారులు కార్మికులకు సంబంధించిన అన్ని వివరాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు లేఖలో వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని